: ప్రకాశం జిల్లాలో రూ.10 కోట్లతో ఉడాయించిన మహిళలు
చిట్టీల పేరుతో జనాలను భారీగా మోసగిస్తున్న వారు ఎక్కువయ్యారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరులో చిట్టీలంటూ స్థానికుల నుంచి వసూలు చేసిన రూ.10 కోట్లతో ముగ్గురు మహిళలు ఉడాయించారు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.