: భయపెడుతున్న హుస్సేన్ సాగర్ నీటిమట్టం
జంటనగరాల మధ్యనున్న హుస్సేన్ సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ప్రమాదకరస్థాయికి చేరింది. రాత్రి నుంచీ ఆగకుండా వర్షం కురుస్తుండడంతో వరదనీరు పోటెత్తుతోంది. దీంతో, సమీపంలోని అరుంధతి నగర్, రత్నానగర్, దోమల్ గూడ, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల ప్రజలలో ఆందోళన నెలకొంది. నీటిమట్టం ఇంకాస్త పెరిగితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది.