: సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా సదాశివం ప్రమాణస్వీకారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి.సదాశివం ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం 40వ ప్రధాన న్యాయమూర్తిగా సదాశివం బాధ్యతలు చేపట్టారు. 2014 ఏప్రిల్ 26 వరకూ సదాశివం ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, ఈ పదవిని చేపట్టిన తొలి తమిళుడు సదాశివం కావడం విశేషం.