: పిలిస్తే.. '108' అంబులెన్స్ రాదు!
తమ డిమాండ్ల సాధన కోసం '108' వైద్య సేవల సిబ్బంది ఆందోళనకు దిగారు. నేటి నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో '108' అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. ఎక్కడ ప్రమాదం జరిగినా ఆపద్బాంధవుడిలా వెంటనే వచ్చి తీసుకెళ్లే '108' అంబులెన్సులు మూగబోయాయి. తమకు వేతనాలు పెంచాలంటూ '108' వైద్య సేవల కాంట్రాక్టు సిబ్బంది గతేడాది ఆందోళన చేపట్టగా జీవీకే యాజమాన్యం దిగివచ్చింది. వేతనాల పెంపునకు హామీ ఇచ్చింది. అయితే, పెంపును అమలు చేయలేదు. దీంతో సిబ్బంది సమ్మె నిర్ణయం తీసుకున్నారు.