: అంగారకుడిపైకి ఈ ఏడాది ఉపగ్రహాన్ని ప్రయోగిస్తాం: రాష్ట్రపతి


ఖగోళ పరిశోధనల్లో భారత్ మరో చిరస్మరణీయ ఘట్టానికి చేరువైంది! ఇప్పటి వరకు  అగ్రరాజ్యాలకే సాధ్యమైన అంగారక గ్రహ యాత్ర  ఇక భారత్ కూడా చేపట్టనుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ ఏడాది అక్టోబరులో అంగారకుడిపైకి ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించున్నట్టు ఆయన తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ చేసిన ప్రసంగంలో ప్రణబ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

మార్స్ ఆర్బిటర్ మిషన్ గా పిలిచే ఈ ఉపగ్రహం అరుణ గ్రహంపై జీవం తాలూకు ఆనవాళ్లు, అక్కడి వాతావరణంలో విపరీత మార్పులను  అధ్యయనం చేస్తుంది. ఇస్రో ప్రయోగించే ఈ ఉపగ్రహాన్ని విశ్వసనీయమైన పీఎస్ఎల్వీ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. దాదాపు 300 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ ప్రయాణం వచ్చే సెప్టెంబరులో అంగారక కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంతో ముగుస్తుంది.

  • Loading...

More Telugu News