: నినాదాలు చేయమని ఎవరూ ఒత్తిడి చేయలేదు: టీ ఎంపీలు


పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో నినాదాలు చేయమని తమను ఎవరూ ఒత్తిడి చేయలేదని టీ కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు. అయితే తెలంగాణ అంశంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో పార్లమెంటు సమావేశాలు జరిగేంతవరకూ ఆందోళన చేస్తామని స్పష్టం చేసిన ఎంపీలు, గూర్ఖాలాండ్ కు, తెలంగాణ అంశానికి పోలికే లేదన్నారు.

కాగా, టీ ఎంపీల మధ్య విభేదాలు ఉన్నాయన్న దానికి నిదర్శనగా ఉదయం పార్లమెంటు వద్ద జరిగిన ఆందోళనలో ఎంపీ మధుయాష్కీ పాల్గొనకపోవడం గమనార్హం. ఆ సమయంలో ఆయన పార్లమెంటులోనే వున్నారు!

  • Loading...

More Telugu News