: భారత్ తో సంబంధాల పటిష్ఠతకు చర్యలు: నవాజ్ షరీఫ్
భారత్ తో మెరుగైన సంబంధాల దిశగా చర్యలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. ఇస్లామాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, తొలుత ద్వైపాక్షిక చర్చల పునరుద్దరణకు పాటుపడతామన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో పర్యటిస్తున్న బ్రిటీష్ విదేశాంగ శాఖ కార్యదర్శి విలియం హేగ్ తో భేటీ సందర్బంగా షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే భారత్ ప్రధాని మన్మోహన్ వద్దకు దూతను పంపామని, త్వరలోనే చర్చలు ఉండొచ్చని ఆయన తెలిపారు. భారత్ తో వాణిజ్యపరమైన సంబంధాలు బలోపేతం చేసుకోనున్నట్టు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. భారత్ నుంచి విద్యుచ్ఛక్తిని కొనుగోలు చేయడం ద్వారా పాక్ లో విద్యుత్ సంక్షోభం నుంచి తేరుకుంటామని తెలిపారు.