: ఎన్నికల సంఘంపై పాలడుగు సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవర్తనా నియమావళి పేరుతో ఎన్నికల సంఘం హద్దులు మీరుతోందని విమర్శించారు. అభిమానంతో ప్రజలు పల్లెల్లో నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారని, అందుకని వాటిపై ముసుగులు వేయించడం ఆ నాయకులను అవమానించడమేనని మండిపడ్డారు.
విగ్రహాలను ముసుగులతో కప్పి వేయాలని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. వాటిని ఏర్పాటు చేసుకునే హక్కు ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిందన్న ఆయన, వాటిపై ముసుగు వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నించారు. ఈ విధంగా ప్రజాస్వామ్య జీవితంలో ఈసీ జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నూజివీడులో విలేకరుల సమావేశంలో తెలిపారు.