: తెలంగాణపై ఏమిటీ నాన్చుడు?: సినీ నటుడు మురళీమోహన్
తెలంగాణ అంశంపై ఎంతకాలం నాన్చుతారని సినీ నటుడు మురళీమోహన్ ప్రశ్నించారు. ఇటీవలే రాజమండ్రి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమితుడైన మురళీమోహన్ నేడు మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నేడు రాజమండ్రి విచ్చేశారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక పంచాయతీ ఎన్నికల ప్రచార ధోరణులపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల అనంతరం వైఎస్సార్సీపీ కూడా ప్రజారాజ్యం తరహాలోనే కనుమరుగవుతుందని అన్నారు.