: రాష్ట్రంలో 2,422 పంచాయతీలు ఏకగ్రీవం
రాష్ట్రంలో 2,422 పంచాయతీలకు సర్పంచులను ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ వెల్లడించారు. 28 గ్రామ పంచాయతీలకు వేలం పాటలు జరిగినట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయని వాటిపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా జరిపిన తనిఖీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8 కోట్ల 22 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దీన్లో అధిక భాగం గుంటూరు జిల్లాలో 3 కోట్ల 30 లక్షల రూపాయలు పట్టుకున్నారని మిట్టల్ అన్నారు.