: బొత్సపై ఎదురుదాడికి దిగిన జగన్ పార్టీ నేతలు


వైఎస్ రాజశేఖరరెడ్డిపై వ్యాఖ్యలు చేసిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై జగన్ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. అవాకులు చెవాకులు పేలుతున్న బొత్సను రాజకీయ సమాధి చేస్తామంటూ హెచ్చరించారు. బొబ్బిలి తాజా మాజీ శాసనసభ్యుడు సుజయరంగారావు విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్ళకు బొత్స అసలు స్వరూపం బయటపడిందని అన్నారు. సత్తిబాబుకు విజయనగరం జిల్లాలో నూకలు చెల్లిపోయే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుంటూరులో మాట్లాడుతూ, బొత్సలాంటి వ్యక్తి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మరో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మాట్లాడుతూ, బొత్స ఓ మాఫియా డాన్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం షర్మిల విజయనగరంలో పర్యటిస్తుండగా, ఆమెకు లభిస్తోన్న ఆదరణను చూసి ఓర్వలేకే బొత్స చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News