: తమిళ సినీ గేయ రచయిత వాలి కన్నుమూత
తమిళ సినీ గేయ రచయిత వాలి (85) అనారోగ్యం కారణంగా మరణించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వాలి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 5 దశాబ్దాలుగా తమిళ సినీ రంగాన్ని ఏలిన వాలి తన రచనా ప్రస్థానంలో దాదాపు 10 వేల పాటలు రాశారు.