: చేతిలో డబ్బు లాక్కుని ఉడాయించిన దుండగులు


ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని వచ్చి స్కూటర్ కు సంచీ తగిలించేలోపు దాన్ని లాక్కుని అగంతకుడు ఉడాయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం బండ్లమెట్టకు చెందిన ఏల్చూరి రామనాగేశ్వరరావు అనే వ్యక్తి బ్యాంకుకు వచ్చి లక్ష రూపాయలు విత్ డ్రా చేసుకున్నారు. నగదు సంచిని వాహనానికి తగిలిస్తుండగా, నేలపై 10 రూపాయల నోట్లు పడి ఉండడం గమనించి వాటిని తీసుకోబోయాడు. అదే అతని పాలిట శాపమైంది. ఇటు తిరిగేసరికి లక్షరూపాయలున్న నగదు సంచీ దొంగల పరమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతకు గంట ముందు బస్టాండు వద్ద ఇదే తరహా చోరీకి ప్రయత్నించి, విఫలం కావడంతో యువకుడు పరారయ్యాడు.

  • Loading...

More Telugu News