: ఇంగ్లండ్ కు హ్యారిస్ షాక్


ఆతిథ్య ఇంగ్లండ్ కు ఆసీస్ సీమర్ ర్యాన్ హ్యారిస్ షాకిచ్చాడు. యాషెస్ రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. నిప్పులు చెరిగిన హ్యారిస్ 9 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. తొలుత ఓపెనర్ రూట్ (6)ను బలిగొన్న ఈ కంగారూ పేసర్ కాసేపటి తర్వాత స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ (2) ను కూడా పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు వాట్సన్.. కెప్టెన్ కుక్ (12)ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ప్రస్తుతం ఆతిథ్య జట్టు స్కోరు 33/3 కాగా.. క్రీజులో ట్రాట్ (12 బ్యాటింగ్), బెల్ (1 బ్యాటింగ్) ఉన్నారు.

  • Loading...

More Telugu News