: పోలీసుల అదుపులో డెక్కన్ క్రానికల్ మాజీ డైరెక్టర్
డెక్కన్ క్రానికల్ మాజీ డైరెక్టర్ సుకుమార్ రెడ్డిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. చండీగఢ్ పోలీసులు ఆయనను హైదరాబాదు నుంచి వెంటనే పంజాబ్ కు తరలించారు.'రెలిగేర్ ఫిన్ వెస్ట్' అనే కంపెనీ నుంచి రూ.100 కోట్లు డెక్కన్ క్రానికల్ రుణంగా తీసుకుంది. వీటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసేందుకు ప్రయత్నిస్తుండటంతో కంపెనీ ప్రతినిధి చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో, వెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు నగరంలోని స్థానిక కోర్టులో డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ టి.వెంకట్రామ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ టి.వినాయక్ రవి రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ పికె.అయ్యర్, సుకుమార్ రెడ్డిలను అరెస్టు చేసేందుకు వారెంటు పొందారు.ఈ కేసులోనే సుకుమార్ రెడ్డిని అరెస్టు చేశారు.