: కూడంకుళంలో నిలిచిపోయిన అణు విద్యుదుత్పత్తి
కూడంకుళం అణు విద్యుత్కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తకి ఆటంకం ఏర్పడింది. సాంకేతికలోపం కారణంగా విద్యుత్ ఉత్పత్తిని పది రోజులపాటు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. విద్యుత్ కేంద్రం ప్రారంభమయినా ఇక్కడి స్థానికుల ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.