: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ధర్నా
హైదరాబాదులోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదురుగా హీరో పవన్ కల్యాణ్ అభిమానులు ధర్నా చేపట్టారు. పవర్ స్టార్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' ఆడియో ఫంక్షన్ కు పాసులు ఇవ్వడం లేదని అతని ఫ్యాన్స్ ధర్నా నిర్వహిస్తున్నారు. 'జల్సా' సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. కాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను రేపు హైదరాబాదు, మాదాపూర్లోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు.