: రాంకీ, జగతి పబ్లికేషన్స్ ఆస్తుల అటాచ్ మెంట్ పై మార్చి 18న విచారణ
రాంకీ, జగతి పబ్లికేషన్స్ కేసులో రూ.143.7 కోట్ల ఆస్తులు అటాచ్ మెంట్ చేస్తూ జనవరి 7న ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నోటీసుపై న్యాయ ప్రాధికార సంస్థ మార్చి 18న విచారణ చేపట్టనుంది. మరోవైపు ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన రెడ్డి, సంస్థల ఆస్తుల అటాచ్ మెంట్ పై మార్చి 7న న్యాయ ప్రాధికార సంస్థ విచారణ చేపడుతుంది. ఇందులో రూ.740 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తూ గాలి, మిగతా సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.