: 'మాకొద్దీ మధ్యాహ్న భోజనం'


మధ్యాహ్న భోజనం పేరు చెబితే చాలు, బీహార్ బాలలు పారిపోతున్నారు. బడిలో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్ధులు ముట్టుకోవడం లేదు. చాప్రా ఘటనలో 23 మంది బాలలు మృతి చెందగా మరో 27 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో బాలలు మధ్యాహ్న భోజనం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో, బాలబాలికలు ఇంటి దగ్గరే భోజనం చేస్తుండడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకం వెలవెలబోతోంది.

గత రెండు రోజుల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్ధుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బడిలో మధ్యాహ్న భోజనాన్ని ముందుగా ఉపాధ్యాయులు తిన్న తరువాతే విద్యార్ధులకు పెట్టాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో తాజా పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News