: సీడబ్ల్యూసీ కంటే ముందే సమైక్యాంధ్ర సభ: శైలజానాథ్
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కంటే ముందే సమైక్యాంధ్ర సభను నిర్వహిస్తామని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. అనంతపురంలో నేడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని తాను నమ్ముతున్నానన్నారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పరిస్థితి ఏమిటనేది తెలుసుకోవాలంటే, ప్రక్కనున్న రాష్ట్రాలను చూడాలని అన్నారు. తమ సభతో కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిలో మార్పు వస్తుందన్న ఆశాభావాన్ని శైలజానాథ్ వ్యక్తం చేశారు.