: లవ్ మ్యారేజెస్ కాదు.. ఎన్నికల మ్యారేజెస్


ప్రేమ పెళ్లిళ్లు చూసి ఉంటారు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లూ లోకవిదితమే. మరి అధికారం కోసం జరిగే పెళ్లిళ్లు విన్నారా? పంచాయతీ ఎన్నికల సమరం ముందు ఇప్పుడు 'మ్యారేజెస్ ఫర్ ఎలక్షన్స్' సందడి నడుస్తోంది.

గ్రామంలో సర్పంచ్ అంటే అదో ప్రత్యేక గౌరవం. నిధులు, పెద్దగా అధికారాలు లేకపోయినా ఆ ఊరిలో గౌరవ వ్యక్తిగా చలామణీ కావాలని, అక్కడి నుంచి రాజకీయ నేతగా ఎదగాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే, అలాంటి ఆశాజీవులందరికీ రిజర్వేషన్లు అడ్డుగోడలుగా ఉన్నాయి. ఈ నెల చివర్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కానీ, సర్పంచుల పదవుల్లో సగం మగువలకే రిజర్వేషన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో ఏం చేయాలో పాలుపోక ఔత్సాహికులకు తట్టిన ఆలోచన.. పెళ్లి చేసుకుని శ్రీమతితో నామినేషన్ వేయించడం. ఇప్పడు కొందరు పురుషపుంగవులు అదే చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా దేవులవాడ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఎ.తిరుపతి అనే వ్యక్తి ఎప్పటి నుంచో పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేయాలని కాచుక్కూర్చున్నాడు. తీరా సర్పంచ్ గిరి రిజర్వ్ అయిపోవడంతో.. దుర్గం సమ్మక్క అనే ఎస్సీ యువతిని పెళ్లాడి ఆమెతో నామినేషన్ వేయించేశాడు. ఇలాంటివి గతవారంలో మొత్తం మూడు జరిగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News