: సోనియాతో స్పీకర్ నాదెండ్ల భేటీ


తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ఇంకా ముగిసినట్టులేదు. హస్తినలో నిన్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిసిన అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. తెలంగాణపై అభిప్రాయం వెల్లడించేందుకు నాదెండ్ల.. మేడమ్ ను కలిసినట్టు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం విషయం తేల్చేందుకు మరికొద్దిరోజుల్లో కాంగ్రెస్ వర్కింట్ కమిటీ సమావేశం అవ్వాల్సి ఉండగా.. స్పీకర్, సోనియాతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News