: ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నజరానా
రాష్ట్రంలో ఏకగ్రీవమైన రెండువేల పైచిలుకు పంచాయతీలకు ప్రభుత్వం అధిక పారితోషికాన్ని ప్రకటించింది. ఇంతకుముందు కంటే 35 శాతం ఎక్కువ నిధులు ఇస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక 13వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1400 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. కాగా, తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేది కాదన్న మంత్రి.. తెలంగాణకు, పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే, సమైక్యాంధ్రప్రదేశ్ కు తామందరం కట్టుబడి ఉన్నామని ఆనం తెలిపారు.