: ఇమేజి కోసం పర్యాటక శాఖ పాట్లు


దేశంలో చోటు చేసుకుంటున్న విపరీత ధోరణులతో పర్యాటక శాఖకు విపరీత నష్టం వాటిల్లింది. విదేశీ పర్యాటకులపై వరుసగా జరిగిన దాడులు, అత్యాచారాలు అంతర్జాతీయంగా దేశం పరువు ప్రతిష్ఠల్ని మంటగలిపేశాయి. జరిగిన భారీ నష్టంతో కళ్ళు తెరిచిన పర్యాటక శాఖ ఇమేజి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటోంది. దేశంలో పర్యాటకంతో సంబంధం ఉన్న వారంతా 'ఐ రెస్పెక్ట్ విమెన్' అనే బ్యాడ్జీలు ధరించే ఏర్పాటు చేస్తోంది. అందుకు అవసరమయ్యే బ్యాడ్జీలు తయారు చేసేపనిలో పడింది పర్యాటకశాఖ.

ఈ మేరకు రేపు జరగనున్న రాష్ట్రాల పర్యాటక శాఖల మంత్రుల సమావేశంలో చర్చించనున్నారు, అందులో మంత్రులు కూడా వీటిని ధరించనున్నారని ఆ శాఖాధికారి తెలిపారు. హిందీ, ఇంగ్లీషుతో పాటు 9 అంతర్జాతీయ భాషల్లో వీటిని రూపొందిస్తున్నారు. ఈ బ్యాడ్జీలను టూర్ ఆపరేటర్లు, గైడ్లు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, ఆతిథ్య రంగానికి చెందిన వారు ధరించనున్నారు. దీని వల్ల పర్యాటకుల్లో సదభిప్రాయం ఏర్పడుతుందని, తద్వారా నమ్మకం పెరుగుతుందని పర్యాటక శాఖ అభిప్రాయపడుతోంది.

  • Loading...

More Telugu News