: ప్రారంభమైన విజయమ్మ 'ఫీజు' దీక్ష


ఫీజు రీయింబర్స్ మెంటుపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష ప్రారంభమైంది. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షను వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. అర్హులైన విద్యార్ధులకు బోధనా రుసుము, బకాయిలు చెల్లించాలని డిమాండు చేస్తూ విజయమ్మ ఈ దీక్ష చేపట్టారు. సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మూడోసారి ఆమె ఈ దీక్ష చేపట్టారు. రెండ్రోజులపాటు ఈ దీక్ష జరగనుంది.

  • Loading...

More Telugu News