: జగన్ కు ఊరట
కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి సంస్థకు సంబంధించిన రూ.51 కోట్ల మేర ఆస్తుల అటాచ్ మెంటుపై అప్పిలేట్ ట్రైబ్యునల్ స్టే విధించింది. ఆస్తులను అటాచ్ చేస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన తీర్పుపై అప్పిలేట్ ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.