: ఇక యాసిడ్ కొనాలంటే ఫొటో ఐడీ చూపించాల్సిందే!


అతివలపై యాసిడ్ దాడులు పెరిగిపోతుండడంతో సుప్రీంకోర్టు పలు కీలక మార్గరద్శకాలను ప్రకటించింది. యాసిడ్ విక్రయాలను కఠినతరం చేసింది. ఇకపై విక్రయదారులు ఫొటో ఐడీ చూపిస్తేనే యాసిడ్ విక్రయించాలి. అలాగే కొనుగోలుదారు పేరు, చిరునామా, ఏ అవసరం కోసం కొంటున్నారు? తదితర వివరాలతో రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. 18ఏళ్ల వయసులోపు వారికి విక్రయించకూడదు. ఉల్లంఘిస్తే 50,000 రూపాయలు జరిమానా కట్టాలి. ఇవన్నీ ప్రజలకు తెలిసేలా తక్షణం ప్రచారం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఈ రోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

అలాగే యాసిడ్ దాడి బాధితులు ప్రతీ ఒక్కరికి 3 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. యాసిడ్ దాడిపై పోలీసు కేసు నమోదైన 15 రోజుల్లోపు ముందుగా బాధితులకు లక్ష రూపాయలు అందించాలని సూచించింది.

  • Loading...

More Telugu News