: పాకిస్తాన్ హిందువులపై పెరుగుతున్న దాడులు


పాకిస్తాన్ లో హిందువులపై ఈమధ్య కాలంలో దాడులు ఎక్కువవుతున్నాయి. సాధారణంగా సున్నీయేతర ముస్లింలను చిన్న చూపు చూసే పాకిస్థాన్ లో.. షియాలు, హిందువులు, క్రిస్టియన్ల పరిస్థితి మరింత దిగజారింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన 'యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్(యూఎస్ సీఐఆర్ఎఫ్)' అనే సంస్థ వెల్లడించింది. పలు దేశాల్లో మత స్వేచ్ఛపై ఈ సంస్థ పరిశోధనలు చేపడుతుంది. పాకిస్థాన్ లో గడచిన ఏడాదిన్నర కాలంలో మతపరమైన దాడులు 203 జరుగగా, అందులో 700 మంది మరణించారు. 1100 మంది గాయపడ్డారు.

ప్రధానంగా షియా వర్గాన్ని లక్ష్యం చేసుకుని ఆత్మాహుతి దాడులు జరుగుతుండగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ కాల్పులకు పాల్పడుతున్నారు దుండగులు. హిందువులతో పాటు సిక్కులూ వీరి బారినపడి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈమధ్య కాలంలో ఏడుగురు హిందూ మహిళలపై అత్యాచారాలు జరిగాయని ఈ సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News