: వీడు నిజంగా కామపిశాచి


కనుపాపే కంటిని కాటేస్తే.. కంచే చేనును మేస్తే అంతకంటే దుర్మార్గం, దారుణం ఉంటాయా! తాజాగా రాజస్థాన్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. అక్కడ జరుగుతున్న దురాగతాలు, కిరాతక చర్యలు వింటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. తాజాగా భరత్ పురాలో సభ్యసమాజం జీర్ణించుకోలేని దుర్మార్గం వెలుగు చూసింది. ఓ కామాంధుడైన తండ్రి తన ఇద్దరు కుమార్తెలను కొన్నేళ్లుగా అనుభవిస్తూ, తన మనవరాలిని కూడా చెరిచాడు. తాను చేసిన దారుణంపై నోరెత్తితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరిస్తూ.. చాలా కాలంగా ఈ అత్యాచార పర్వం సాగిస్తున్నాడు.

ఆ కామాంధుడికి అతని భార్య సహకరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. చేసిన దుర్మార్గం చాలక తమ ధాకర్ కుటుంబ సంప్రదాయంలో అలాగే అనుభవిస్తారని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. విషయం వెలుగులోకి రావడంతో రాజస్థాన్ లోని భరత్ పురలో నివాసముండే బాబులాల్ ధాకర్, అతని భార్య శకుంతల ధాకర్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరికి జూలై 31 వరకు కోర్టు రిమాండు విధించింది.

  • Loading...

More Telugu News