: బీహార్లో మావోయిస్టుల ఘాతుకం
బీహార్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని పాట్నా సమీపంలోని గోహ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ టన్నెల్ వద్ద కల్వర్ట్ ను మావోయిస్టులు పేల్చివేసే ప్రయత్నంలో ఉండగా.. పోలీసులు కాల్పులు ఆరంభించారు. నక్సల్స్ కూడా ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు పోలీసులు, ఇద్దరు ప్రైవేటు భద్రత సిబ్బంది మరణించారు. అనంతరం మావోయిస్టులు అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనలో 50 మంది సాయుధ నక్సలైట్లు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా భద్రత బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నామని బీహార్ డీజీపీ అభయానంద్ తెలిపారు.