: 'నీట్' నోటిఫికేషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
జాతీయ స్థాయిలో వైద్యవిద్య కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే 'నీట్' (జాతీయ స్థాయి అర్హత పరీక్ష) పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు నీట్ నోటిఫికేషన్ ను కొట్టివేసింది. రాష్ట్రాలు యథాతధంగానే ఎంసెట్ పరీక్ష నిర్వహించుకోవచ్చని, పాత పద్ధతిలోనే అడ్మిషన్ల కౌన్సెలింగ్ చేపట్టాలని ఆదేశించింది. దీంతో, వైద్య విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు ఊరట కలిగించినట్టయింది.