: శబరిమలలో భారీ వర్షం.. అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు
కేరళలోని శబరిమలలో భారీగా వర్షం పడుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కర్కాటక మాస పూజల కోసం నిన్న శబరిమల ఆలయాన్ని తెరవడంతో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇటు భారీగా వర్షం కురుస్తుండటంతో శబరిమల వెళ్లే దారిలో 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీని ఫలితంగా ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యం పాలయ్యారు.