: నేడు 'నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే'
జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడి నల్లజాతివారికి ఒక మార్గదర్శిలా నిలిచిన గొప్ప నేత నెల్సన్ మండేలా. వర్ణవివక్షపై పోరాటంలో భాగంగానే 27ఏళ్ల పాటు జైలు గోడల మధ్య జీవితాన్ని గడిపాడు. అందుకే జైలు నుంచి బయటకు వచ్చాక మండేలాను దక్షిణాఫ్రికా ప్రజలు 1994లో అధ్యక్ష పీఠమెక్కించారు. దక్షిణాప్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడు మండేలానే.
తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ విషమ పరిస్థితుల్లో జూన్ 8 నుంచి మండేలా ప్రిటోరియాలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ఆయన పరిస్థితిలో ఏ మాత్రం మెరుగుదల లేదు. మరోవైపు నేడు మండేలా 95వ పుట్టిన రోజును ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. మండేలా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కోరుకుంటున్నారు.
ప్రపంచశాంతికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఇప్పటికే నోబెల్ బహుమతి వరించగా.. ఐక్యరాజ్యసమితి కూడా మండేలా పుట్టిన రోజు జూలై 18వ తేదీని 'నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే'గా ప్రకటించింది.