: రాష్ట్రం రెండుగా విడిపోతే ప్రమాదమేంటి?: ఉండవల్లి


రాష్ట్రం రెండుగా విడిపోయినా ప్రమాదమేమీ లేదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయితే, విడిపోవాలని కోరుకునేవారికి అసెంబ్లీలో మెజారిటీ అవసరమని తేల్చి చెప్పారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం వస్తేనే రాష్ట్ర విభజన సాధ్యమన్నారు. దేశ ప్రయోజనాల రీత్యా ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని చెప్పారు. ఈ మేరకు ఉండవల్లి విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రులను దోపిడీ దొంగలని ముద్రవేయడం పట్ల ఆయన మండిపడ్డారు. సీమాంధ్రులను దూషించడమే టీఆర్ఎస్ ఎజెండా అని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించవద్దని పార్లమెంట్ లో లేవనెత్తుతానన్నారు. ఉత్తర, దక్షిణ భారత ప్రజల మధ్య అభిప్రాయ బేధాలు రావచ్చని అంబేద్కర్ ఆనాడే చెప్పారని, అందుకే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిని చేయాలని సూచించారన్నారు.

  • Loading...

More Telugu News