: రైల్లో మహిళ మెడకు ఉరి, నగలు దోచివేత


మన రాష్ట్రంలో రైలు దొంగలు పేట్రేగిపోతున్నారు. రైళ్లలో మహిళల భద్రతను ప్రశ్నించే రీతిలో భయంకర ఘటన ఒకటి గత రాత్రి జరిగింది. హౌరా నుంచి యశ్వంత్ పూర్ వెళుతున్న రైలు గూడూరు స్టేషన్ సమీపంలో ఉండగా కొందరు దుండగులు తునికి చెందిన భవానీ మెడకు సన్నని తాడుతో ఉరి బిగించారు. ఊపిరాడక ఆమె ఉక్కిరిబిక్కిరి కాగా, అదే అదనుగా వంటిపై ఉన్న నగలను దోచుకున్నారు. అంతటితో వదిలేయకుండా.. రైలు గూడూరు స్టేషన్ లో ప్రవేశించగానే, భవానీని రైల్లోంచి ప్లాట్ ఫామ్ పైకి తోసివేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను తక్షణం స్థానిక ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె సృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News