: పార్లమెంటు వద్ద మహిళల ఆందోళన
భారతీయ మహిళ పోరు బాట పట్టింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో పలువురు మహిళలు పార్లమెంటు భవనం ముట్టడికి ప్రయత్నించారు. ఓపక్క పార్లమెంటు లోపల రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకోవడం పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది.
కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని చేధించుకుని మహిళలు పార్లమెంటు ప్రధాన ద్వారం వైపు దూసుకురావడంతో, వారిని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది ఆందోళన చేస్తున్న మహిళలను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.