: ఆక్రోట్‌తో క్యాన్సర్ దూరం
మన రోజువారీ ఆహారంలో ఎంతో కొంత మేర గింజల్ని తింటే మంచిదని ఇప్పటికే పలువురు పరిశోధకులు చెబుతున్నారు. అయితే వీటిలో ఆక్రోట్లు (వాల్‌నట్స్) తింటే మరింత మేలని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ వాల్‌నట్స్ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల బారినుండి అవి మనల్ని కాపాడుతాయని ఈ పరిశోధనలో తేలింది.
టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక పరిశోధనలో ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటినుండి వాల్‌నట్స్ మనల్ని కాపాడతాయని తేలింది. మనం తీసుకునే ఇతర గింజ ధాన్యాలకంటే వాల్‌నట్స్ మరింతగా మనకు మేలుచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వీరు తమ పరిశోధనలో రోగ నిరోధక శక్తి లోపించిన ఎలుకల్లో మానవ ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టి పరిశీలించారు. రోజూ పరిమితంగా ఆక్రోట్ పప్పును ఆహారంలో తీసుకుంటే ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చని లేదా వాటికి కొంతమేర దూరంగా వుంచచ్చని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన రసెల్ రీటర్ చెబుతున్నారు.