: గుండెపై చంద్రుడి ప్రభావం ఉందట!


మన జాతకాల్లో చంద్రుడు ఇలా తిరుగుతున్నాడు, అలా ఉన్నాడు అంటూ మన జాతకాలను పరిశీలించిన వారు చెబుతుంటారు. అయితే వీటిలో నిజానిజాలు ఎంతమేరకు ఉన్నాయి? అనే విషయం పక్కన పెడితే, చంద్రుడి ప్రభావం మాత్రం మన గుండెపై బాగానే ఉంటుందట. గుండె ఆపరేషన్లు వంటివి నిర్వహించాలంటే చంద్రుడిని గమనించి చేస్తే మంచిదని, ఆపరేషన్లు ఫెయిలయ్యే సమస్య ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.

అమెరికాలోని రోడ్‌ ఐలాండ్‌ ఆసుపత్రి పరిశోధకులు ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. చంద్రుడి గతి ఆధారంగా గుండెకు చికిత్సను నిర్వహిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని తాము నిర్వహించిన అధ్యయనంలో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో వివిధ రకాల హృద్రోగ చికిత్సలపై చంద్రుడి దశలు, ఋతువుల్లో తేడాలు చూపే ప్రభావాన్ని పరిశీలించారు. కృష్ణపక్షంలో అక్యూట్‌ అయోర్టిక్‌ డిసెక్షన్‌ అనే హృదయ చికిత్సను నిర్వహిస్తే రోగి మరణించే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశీలనలో అయోర్టిక్‌ డిసెక్షన్‌ అనే శస్త్రచికిత్సను పౌర్ణమి దశలో నిర్వహిస్తే ఆసుపత్రిలో గడపాల్సిన సమయం నాలుగు రోజుల మేర తగ్గుతుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఫ్రాంక్‌ చెబుతున్నారు. ఈ చికిత్సను కృష్ణపక్షం (చంద్రుడు తిరగిపోయే దశ)లో చేపడితే శస్త్రచికిత్స అనంతరం రోగి మరణించే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని తమ పరిశోధనలో తేలిందని ఫ్రాంక్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News