: ముఖ్యమంత్రి ఓ కుర్రకుంక: కేకే
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత కె.కేశవరావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు అడ్డుపడుతూ కుర్రకుంకలా వ్యవహరిస్తున్నారని కేకే మండిపడ్డారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, సీఎం వెంట తిరిగే తెలంగాణ ప్రాంత మంత్రులను ద్రోహులుగా అభివర్ణించారు. ఇక ఇందిర తెలంగాణ ఇవ్వడం సబబు కాదన్నారని సీఎం ప్రచారం చేయడం మానుకోవాలని కేకే హితవు పలికారు. ఇందిర హయాంలోనే 14 చిన్న రాష్ట్రాలు ఏర్పడిన సంగతి కిరణ్ తెలుసుకోవాలన్నారు. లక్ష కోట్ల ప్యాకేజి కోరడం ద్వారా తెలంగాణకు ఇప్పటి వరకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని సీఎం పరోక్షంగా అంగీకరించినట్టే అని కేకే అన్నారు.