: స్నోడెన్ కు ఝలకిచ్చిన పుతిన్


అగ్రరాజ్యం అమెరికాను వీడి మాస్కో విమానాశ్రయంలో తలదాచుకున్న ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఝలక్ ఇచ్చారు. స్నోడెన్ కన్నా తమకు అమెరికాతో సత్సంబంధాలే ముఖ్యమని తెగేసి చెప్పారు. అయితే, అలనాటి ప్రచ్ఛన్న యుద్ధాన్ని పుతిన్ అప్పుడే మర్చిపోయినట్టున్నాడని, చిరకాల శత్రువు అమెరికాతో అంటకాగేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడంటూ ఆయనపై రష్యాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సైబీరియా ప్రాంతంలో పర్యటిస్తున్న పుతిన్ నేడు మీడియాతో మాట్లాడారు.

స్నోడెన్ అంశం రష్యా-అమెరికా సంబంధాలను ప్రభావితం చేస్తుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాత్కాలిక వ్యవహారాలకంటే ద్వైపాక్షిక బంధాలే ముఖ్యమని పేర్కొన్నారు. రష్యా-అమెరికా సంబంధాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలను తాము సమర్థించబోమని ఈసరికే స్నోడెన్ కు స్పష్టం చేశామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో స్నోడెన్ కు రష్యా ఆశ్రయం కల్పించేది సందేహమే. ఇక ఆయన లాటిన్ అమెరికా దేశాలకు పయనం కాకతప్పదేమో!

  • Loading...

More Telugu News