: తెలంగాణ అభివృద్ధికి ఏ త్యాగానికైనా సిద్ధమే: ఆనం వివేకానంద రెడ్డి
తెలంగాణ అభివృద్ధి కోసం సీమాంధ్ర నేతలు ఏ త్యాగానికైనా సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రుల హయాంలో ఆ ప్రాంతంలో అభివృద్ధి శూన్యమని, సీమాంధ్ర ముఖ్యమంత్రులే తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారన్నారు. అలాగే పటేల్, పట్వారీ వ్యవస్ధను రద్దు చేసి తెలంగాణ ప్రజలకు ఆత్మ గౌరవాన్ని పెంచింది సీమాంధ్ర ముఖ్యమంత్రులేనన్న విషయాన్ని మరువొద్దన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది కేవలం సీమాంధ్ర ముఖ్యమంత్రులేనని స్పష్టం చేశారు. విభజన కోసం కేసీఆర్ వంటి నేతలు చేసే కుటిలప్రయత్నాలు ఫలించవని వివేకా తెలిపారు.