: విండోస్ ఎక్ప్ పీ వాడితే మాదికాదు పూచీ: మైక్రోసాఫ్ట్ హెచ్చరిక


విండోస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టమ్ కు 2014 ఏప్రిల్ 8వరకే తాము రక్షణ కల్పించగలమని సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అంటోంది. ఆ తర్వాత ఎవరైనా ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగించి ఇబ్బందులు పాలైతే తమ పూచీ కాదని హెచ్చరిస్తోంది. మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టమ్ ను 2001లో మార్కెట్లో విడుదల చేసింది. అనంతరం పలుమార్లు దాన్ని ఆధునికీకరిస్తూ పలు వెర్షన్లను రూపొందించింది. 2006లో విస్టా, 2009లో విండోస్ 7, 2012లో విండోస్ 8ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విండోస్ ఎక్స్ పీని తాము ఇక ఆధునికీకరించబోవడంలేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేస్తోంది. దీంతో, వినియోగదారులు తమ కంప్యూటర్లను కొత్త ఓఎస్ లతో అప్ గ్రేడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News