: ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకే నక్సలిజం తీవ్రత హెచ్చింది: విద్యాసాగర్ రావు


తెలంగాణ ఏర్పాటైతే నక్సలిజం పెరుగుతుందంటూ కాంగ్రెస్ కోర్ కమిటీకి సీఎం నివేదిక ఇవ్వడాన్ని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు తప్పుబట్టారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణపై వివక్షతోనే సీఎం నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. శ్రీకాకుళంలో మొదలైన నక్సలిజాన్ని సీమాంధ్ర నాయకులు తెలంగాణకు విస్తరింపజేశారని ఆరోపించారు. నక్సలిజం బూచిగా చూపి తెలంగాణ ప్రజలను అవమానించిన సీఎం, టీడీపీ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు పంచిన 75 లక్షల ఎకరాల మిగులు భూముల లెక్క చెప్పాలని అన్నారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ జోక్యం చేసుకోవాలని, అన్యాక్రాంతమైన ఇనాం భూముల వివరాలు వెలికి తీయాలని విద్యాసాగర్ రావు కోరారు.

  • Loading...

More Telugu News