: 'బోయింగ్'పై కేసు పెట్టిన ప్రయాణికులు
ఇటీవల అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఏషియానా ఎయిర్ లైన్స్ విమానం క్రాష్ ల్యాండింగ్ ప్రమాదానికి గురికాగా.. ఆ విమాన ప్రమాద బాధితులు 83 మంది నష్టపరిహారం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరంతా విమాన ఉత్పత్తిదారు బోయింగ్ సంస్థపై మిలియన్ డాలర్ల నష్ట పరిహారం కోరుతూ షికాగోలో కేసు దాఖలు చేశారు. షికాగోలో బోయింగ్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. కాగా, ఏషియానా ఎయిర్ లైన్స్ కు చెందిన ఆ విమానం కిందికి దిగే సమయంలో ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 180 మంది గాయాలతో బతికి బట్టకట్టారు.