: ఎమ్మెల్యే సోదరుడి దారుణ హత్య
జడ్చర్ల ఎమ్మెల్యే చంద్రశేఖర్ సోదరుడు జగన్ ఈ మధ్యాహ్నం హత్యకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర పాత బస్టాండ్ వద్ద అతడిని దుండగులు దారుణంగా హతమార్చారు. జగన్ ఓ హోటల్లో టీ తాగుతుండగా అతడిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం వారు స్కార్పియోలో పరారయ్యారు.