: నీరు వృథా చేస్తే 500 జరిమానా


నీరు వృథా చేస్తే 500 జరిమానా..! అవును మీరు చదివింది నిజమే. అది ఎక్కడో కాదు మన దేశంలోనే. నీరు ధారాళంగా వినియోగించే మన దేశంలో ఏంటీ విపరీతం అనుకుంటున్నారా! అవునండీ, మనదేశంలో నీటికి కటకటలాడే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలో భూటాలా అనే గ్రామంలోని పెద్దలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తాగునీరు ఎవరైనా వృథా చేస్తున్నట్టు కన్పిస్తే వారికి 500 రూపాయల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. దీని అమలుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని కూడా నియమించారు. గ్రామంలో ప్రజల సౌకర్యార్థం తాగునీటి పంపులు ఏర్పాటు చేశామని, చాలామంది తాగడానికి వాటినే వినియోగిస్తున్నారని తెలిపారు. కానీ పంపు కట్టాల్సిన బాధ్యత తమది కానట్టు వెళ్లిపోతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామపెద్దలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News