: హైకోర్టులో శంకర్రావుకు స్వల్ప ఊరట


మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుకు రాష్ట్ర హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై శంకర్రావుపై జరుగుతున్న విచారణను వారం రోజుల పాటు నిలిపివేయాలని కోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ నిలిపివేయాలని కోరుతూ శంకర్రావు కొన్నిరోజుల కిందట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం తాజా ఉత్తర్వులు వెలువరించింది.

  • Loading...

More Telugu News