: నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన స్నోడెన్
అమెరికా రహస్యాలను బట్టబయలు చేసిన ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్.. నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. స్వీడన్ కు చెందిన స్టెఫాన్ స్వల్ ఫోర్స్ అనే ప్రొఫెసర్ స్నోడెన్ పేరును నోబెల్ ప్రైజ్ కు నామినేట్ చేశాడు. స్నోడెన్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు అన్ని విధాలా అర్హుడని ఆయన అన్నారు. అగ్రరాజ్యం అమెరికాను ధిక్కరించి ఏకవ్యక్తి సైన్యంలా పోరాడడమంటే మాటలు కాదని స్వల్ ఫోర్స్ అభిప్రాయపడ్డారు.
2009లో బరాక్ ఒబామాకు నోబెల్ ఇవ్వడం ద్వారా ఈ అవార్డుకు ఏర్పడిన అప్రదిష్ఠను స్నోడెన్ ను పురస్కరించడం ద్వారా తొలగించుకోవచ్చని సూచించారు. కాగా, అమెరికాను వీడిన స్నోడెన్ ప్రస్తుతం మాస్కో విమానాశ్రయంలో తలదాచుకున్న సంగతి తెలిసిందే. ఆశ్రయం కల్పిస్తామని లాటిన్ అమెరికా దేశాలు బొలీవియా, వెనిజులా, నికరాగువా ముందుకొచ్చినప్పటికీ.. స్నోడెన్ రష్యాలో ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.