: 'జేమ్స్ బాండ్' నటుడు పాల్ భట్టాచార్జీ అదృశ్యం


జేమ్స్ బాండ్ చిత్రం 'కాసినో రాయల్' చిత్రంలో నటించిన బ్రిటీష్ ఇండియన్ పాల్ భట్టాచార్జీ అదృశ్యమయ్యాడు. గత వారం రోజుల నుంచి ఈ నటుడు కనిపించడం లేదని 'స్కాట్ లాండ్ యార్డ్' పోలీసులు తెలిపారు. 53 సంవత్సరాల గౌతమ్ పాల్ భట్టాచార్జీ 'కాసినో రాయల్' చిత్రంలో డాక్టర్ పాత్ర పోషించాడు. చివరిసారిగా ఈ నెల 10వ తేదీన రిహార్సల్ కోసం లండన్ లోని రాయల్ కోర్టు థియేటర్ వద్ద కనిపించాడట. పదవతేదీకి ముందు రోజున రాత్రి తొమ్మిది గంటలకు పాల్ తన గర్ల్ ఫ్రెండ్ కు ఓ మెసెజ్ పంపాడని తెలుస్తోంది. ఇక, ఆ తర్వాత నుంచి ఎలాంటి స్పందన లేదని 'స్కై న్యూస్' పత్రిక పేర్కొంది.

అయితే, మొదటి రోజు రిహార్సల్స్ సందర్భంగా చాలా ఉత్సాహంగా కనిపించిన భట్టాచార్జీ తర్వాత రోజు రిహార్సల్స్ కు రాలేదని థియేటర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. చివరిసారిగా అతను నీలంరంగు షర్టు ధరించి, నల్లరంగులో ఉన్న ఓ సంచితో ఉన్నట్లు ఆ ప్రతినిధి వివరించారు.

  • Loading...

More Telugu News