: కలం పట్టిన కండలరాయుడు!


బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మంచి నటుడే కాదు, సూపర్ డాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ కండలరాయుడిలోనూ ఓ రచయిత దాగున్నాడన్న విషయం తాజాగా బయటపడింది. ఇప్పటికే చిన్న చిన్న పద్యాలు రాసిన హృతిక్, ఈ మధ్యనే ఓ రెండింటిని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. వాటిని చదవి, పలువురు మెచ్చుకోగా, కొంతమంది లైక్ చేశారు. దాంతో, వీటన్నింటినీ కలిపి ఓ పుస్తకరూపంలో తీసుకురావాలని అతడి బాలీవుడ్ స్నేహితులు విజ్ఞప్తి చేస్తున్నారట.

ఈ విషయమై హృతిక్ సన్నిహితుడొకరు మాట్లాడుతూ..'బ్రెయిన్ సర్జరీ కారణంగా నెలరోజుల పాటు హృతిక్ విశ్రాంతి తీసుకోవాల్సివుంది. పుస్తకం విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని తెలిపాడు. ఇప్పటికే పుస్తకాన్ని ప్రచురించేందుకు ఓ పబ్లిషింగ్ సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో మిత్రుడు మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తను 'క్రిష్ 3', 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కానీ, ఈ పుస్తకం ఆలోచనపై హృతిక్ చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాడు' అని వివరించారు.

మరోవైపు దర్శకుడు కరణ్ జోహార్ కూడా హృతిక్ రచనా నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడట. తన ఆలోచనలను కాగితంపై పెట్టాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా అడుగుతున్నారని సమాచారం. హృతిక్ మాత్రం దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News